ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏపీలోనూ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కలవర పెడుతున్న కొత్త వేరియంట్ల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. విశాఖ జీవిఎంసీ కార్యాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని అత్యవసర సమీక్ష చేపట్టారు. జీవీఎంసీ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వైద్యాధికారులతో మంత్రి విడదల రజనీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరిగానే కోవిడ్ పై ముందస్తుగా అప్రమత్తం కావాలని సూచనలు ఇచ్చారు.
Read Also: Errabelli Dayakar Rao: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
బి ఎఫ్ 7 తీవ్రత ఎలా వున్నా ఎదుర్కొనే పరిస్థితులపై ముందుగా సమాచారం సేకరించాలని….ప్రజలను అప్రమత్తంగా ఉంచేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచనలు చేశారు. ప్రతీ హెల్త్ సెంటర్ లో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించేలా కిట్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. ఒమీక్రాన్ BF7 నియంత్రణ కోసం సన్నద్ధంగా ఉన్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన మా ప్రభుత్వం ఎదుర్కొంటోంది అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు…, జాగ్రత్తలు పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు మంత్రి విడదల రజనీ.
వేక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది…60ఏళ్ల పైబడిన వాళ్ళంతా ముందస్తు వ్యాక్సిన్ వేయించు కోవాలి. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ మీద ఎక్కువ దృష్టిసారించాం.. జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ కోసం విజయవాడ లో ల్యాబ్ అందుబాటులో ఉంది. ప్రతీ జిల్లాలోను ల్యాబ్ లు పూర్తి స్థాయిలో పని చేస్తాయన్నారు. హాస్పిటళ్లను అన్ని రకాల సౌకర్యాలతో పాటు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నాం అన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వమని ఆదేశించాం అన్నారు మంత్రి విడదల రజనీ.
Read Also:Ram Charan: రామ్ చరణ్ వేసుకున్న ఈ షర్ట్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..
ఇదిలా ఉంటే ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్ నివాస్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలో అంతర్జాతీయ వ్యాక్సినేషన్ సెంటర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 24 తేదీ నుంచి అంతర్జాతీయ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలు, అనుమతులతో సిద్ధార్ధ వైద్య కళాశాల ఆవరణలో అంతర్జాతీయ వ్యాక్సినేషన్ సెంటరును ప్రారంభిస్తున్నాం.అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న యెల్లో ఫీవర్ వ్యాక్సినేషనుతో ఈ సెంటర్ ప్రారంభిస్తాం.ఆ తర్వాత అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వ్యాక్సిన్లను ఇక్కడ అందుబాటులో వుంచుతాం.ప్రస్తుతం మన దేశంలో యెల్లో ఫీవర్ లేకున్నా.. సెంట్రల్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చే పర్యాటకుల వల్ల ఈ ప్రమాదకర వ్యాధి మన దేశంలో ప్రవేశించటానికి అవకాశం ఉందన్నారు నివాస్.
Read Also: YouTube Channels Ban: 104 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ఉక్కుపాదం..