దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 656 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. కేరళ, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని, కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
విదేశాల్లో కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
కరోనాకు పుట్టినిలైన చైనాను మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. షాంఘైలో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ఆకలి కేకలతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కఠిన లాక్‌డౌన్‌తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి…