ఎంతమంది చంద్రబాబు కలిసి వచ్చినా.. వైఎస్ జగన్‌ను ఏమీ చేయలేరు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇక, గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి విడుదల రజిని.. ఎవరు ఎవరిని తెచ్చుకున్నా ఇక్కడ గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆధునికీకరించిన కార్డియాలజీ విభాగాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 యేళ్లు పూర్తి చేసుకుంది..
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ శుక్రవారం(సెప్టెంబర్ 15) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యమన్నారు.
Minister Vidadala Rajini Flex: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్2లో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజినికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత.. అయితే, కొందరు మంత్రి రజిని అభిమానులు ఆమె శాఖను మార్చేశారు.. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పేర్కొన్నారు.. అంతేకాదండోయ్.. ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దారి పొడువునా కట్టేశారు.. ఇది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో.. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.. అసలు విడదల…