Minister Seethakka: బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదన్నారు. కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందన్నారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదన్నారు. నిరసనల్లో కూడా తమ దురంకారాన్ని ప్రదర్శించారన్నారు. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని మంత్రి మండిపడ్డారు. టీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారన్నారు.
Read Also: BJP New President: కొత్త సంవత్సరంలోనే బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక
కనీసం అప్పుడు అధికారుల మీద చర్యలు లేవని.. రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారన్నారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్‌పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. గతంలో వెల్‌లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసేవారన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. సంగారెడ్డిలో బేడీలు వేసిన అధికారులపై ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందన్నారు.