సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. కరెంట్ వెలుగులు తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ కరెంట్ తెస్తే.. కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? అని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM KCR: తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు నిలబడితే గెలవాలంతే..! అంటూ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మూడు జిల్లాలో పర్యటనలో భాగంగా.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో టిటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు.
Telangana: ప్రజల క్షేమమే మా ధ్యేయం అనే నినాదంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. తేడా వస్తే ప్రాణాలు తియ్యడానికి కూడా ఆలోచించని మావోయిస్టులను చూస్తే ఎవరైనా భయపడాల్సిదే. ఎందుకంటే వాళ్లకు ఏదైనా తప్పుగా అనిపిస్తే సింపుల్ గా చంపేస్తారు. తెలంగాణలో మావోయిస్టుల మనుగడ దశాబ్దాలుగా కొనసుగుతూనే ఉంది. వీళ్ళకి పేద ప్
Harish Rao: నెల రోజులు సీరియస్ గా కష్ట పడాలని.. మేనిఫెస్టోను డోర్ టు డోర్ అతికించాలని మంత్రి హరీష్ రావ్ పార్టీ శ్రేణులకు సూచించారు. జలవిహార్ లో బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి లతో, వార్ రూమ్ సభ్యుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు. అయితే, సిద్దిపేట నుంచి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ మార్గ మధ్యంలో ‘సోనీ ఫ్యామిలీ దాబా'లో కాసేపు ఆగారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో కేసీఆర్ చాయ్ తాగుతు కనిపించారు.
BRS Leaders: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారు.
ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్ప�
BRS Leaders: మహారాష్ట్రలోని షోలాపూర్లో జరగనున్న పద్మశాలి ఆరాధ్యదైవం మార్కండేయ రథోత్సవంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి వలస వచ్చిన పద్మశాలీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రం తరపున మంత్రులు హాజరుకానున్నారు.