కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. కేంద్రం నియమించిన దౌత్య బృందానికి నాయకత్వం వహించారు. పాకిస్థాన్ వైఖరిని విదేశాల్లో ఎండగట్టేందుకు అధికార-ప్రతిపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపించింది. ఇక కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను కేంద్రం నియమించడంపై వివాదం చెలరేగింది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర చేస్తున్నాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆరోపించారు. ఇటీవల ముడా స్కామ్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సిద్ధరామయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రిలీప్ దొరికింది.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అని మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) విమర్శించారు. ప్రకాశం జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు నగరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇద్దరు నాయకులు తిరుగుతున్నారు.. రెండు, మూడు రోజుల నుంచి నెల్లూరులో విచిత్రమైన పరిస్థితి ఉంది.. ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని నారాయణ ఒకవైపు తిరుగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొందరు టీడీపీ నేతలతో కలిసి జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి తిరుగుతున్నారు..
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజమంత్రి జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం అని కోమటిరెడ్డి చెప్పారు.
జనసేనలాగ మాది పావలా బేడా పార్టీ కాదు అని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నాడు.. అసలు రాష్ట్రంలో ఉంటేనే కదా పగలు ఏం జరుగుతుందో చూస్తే రాత్రికి కలలు కానొచ్చు.