టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడమే ‘ఈ-గరుడ’ ముఖ్య ఉద్దేశం అన్నారు. రానున్న రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని, వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ చరిత్రలో సువర్ణధ్యాయమన్నారు. అంతేకాకుండా..’రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం అందించండం కోసం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకీ తీసుకొచ్చాం.
Also Read : Monsoon: ఈ సారి సాధారణం కన్నా తక్కువ వర్షపాతమేనా..? రుతుపవనాలపై “ఎల్ నినో” ఎఫెక్ట్
రోజు రోజుకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ సంఖ్య పెరుగుతుంది.. ఈ సంవత్సరం హైదరాబాద్ లో 500 బస్సులు, హైదరాబాద్ నుండి విజయవాడకు 50 బస్సులు అందుబాటులోకీ వస్తాయి.. పది డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ కూడా అందుబాటులో కీ తెస్తాం.. రాబోయే తరం ఎలక్ట్రికల్ యుగం.. మారుతున్న టెక్నాలజీ కీ అనుగుణంగా మార్పు చెందాలి.. టీఎస్ఆర్టీసీ ఈమధ్య కాలంలో అందుబాటులోకీ తెచ్చిన స్లిపర్ బస్సులకు మంచి ఆదరణ లభించింది.. టీఎస్ఆర్టీసీ గడ్డు పరిస్థితులను ఎదర్కోని నిలబడింది.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం 1500 కోట్ల నిధులు కేటాయిస్తున్నారు.. మెరుగైన ప్రజా రవాణా కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది’ అని ఆయన అన్నారు.
Also Read : IPL 2023 : 10 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ ఎంతంటే..?