సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న తొలిసారి కలిసి ‘సికందర్’ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ జంటను తెరపై చూడటం అభిమానులకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ వీరిద్దరి మధ్య 31 సంవత్సరాల వయస్సు తేడా. దీని కారణంగా.. సల్మాన్, రష్మిక మందన్నల ఆన్-స్క్రీన్ జతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రష్మిక తనకు సల్మాన్ తో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు.. తన మొదటి రియాక్షన్ ను వ్యక్త పరిచింది. ఆజ్‌తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ‘సికందర్’లో సల్మాన్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంది. సల్మాన్ ఖాన్ తో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు..మొదట ఆమె ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపింది. అంత పెద్ద హీరోతో సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? అని తనను తాను ప్రశ్నించుకున్నట్లు చెప్పింది.
READ MORE: Saif Ali Khan: “ఇదంతా కుట్ర”..కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడు..
సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ.. “నాకు మొదటిసారి ‘సికందర్’ సినిమాలో నటించాలని కాల్ వచ్చినప్పుడు.. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే.. నేను ఫస్ట్ యాక్టర్ కావాలని అనుకోలేదు. కానీ ఏదో ఒకవిధంగా యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాను. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందంటే ఇంతకు ముందు సినిమాల్లో బాగా నటించినట్లు భావించాను. ఎందుకంటే.. ఒకవేళ నా యాక్టింగ్ నచ్చకపోతే ఈ అవకాశం వచ్చేది కాదు కదా? ” అని నటి వెల్లడించింది. కాగా.. రష్మిక వయసు 28 ఏళ్లు కాగా.. సల్మాన్ వయసు 59 సంవత్సరాలు.