Minister Nadendla Manohar: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో అధినేత పవన్ కల్యాణ్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని ప్రశంసలు కురిపించారు జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా సత్కారం చేశారు.. ఆ తర్వాత అంతా కలిసి పవన్ కల్యాణ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం.. మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు.. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలని సూచించారు.. పదవులు మనకొచ్చాయి.. కానీ, మనకోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దు అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు.. తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
Read ALso: Puja Khedkar : రైతును తుపాకీతో బెదిరించిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి.. పోలీసులకు భయపడి పరార్
కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు నాదెండ్ల మనోహర్.. నిజాయితీగా పని చేయాలన్నారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసిందని విమర్శించారు.. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నాం. గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం. ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సాయం కింద రూ. 18 కోట్లు అందించాం. ప్రభుత్వంలో ప్రతి జనసైనికుడూ భాగస్వామే. ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై అవగాహన పెంచుకోవాలి.. ప్రజలకు వివరించాలి. ఇది మన ప్రభుత్వం.. పార్టీకి.. పవన్‌కు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలి. పవన్ కళ్యాణ్ టీం అంటే ఇదీ అని అందరూ గొప్పగా చెప్పుకునేలా పని చేయాలి. గత ఎన్నికల్లో ప్రజలు సైలెంటుగా ఓటేశారు. ఎన్నికల ముందు వరకు ఏ మాత్రం బయటపడని ప్రజలు.. ఎన్నికల్లో తామేంటో చూపించారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్.