రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మంత్రి కేటీఆర్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009లో గెలిస్తే తెలంగాణ తెస్తా అని మీకు హామీ ఇచ్చినా.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, అందులో అందరి కష్టం ఉందని అన్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా.. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని తెలిపారు. వీర్నపల్లి స్కూల్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసి వెళ్ళండి.. అంతర్జాతీయ స్కూల్ లాగా తీర్చిదిద్దాం.. చూడని వాళ్లు చూసి వెళ్ళాలని కేటీఆర్ పేర్కొన్నారు. మండలంలో ఇలాంటి స్కూల్ అన్ని గ్రామాల్లో కట్టిస్తానని తెలిపారు.
Ambati Rambabu: పవన్ పగటి కలలు కంటున్నాడు..
తండాలు గ్రామ పంచాయతీ చేయాలని కోరితే మన రాష్ట్రం వచ్చాక 3146 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అన్ని అభివృద్ధి పనులు చేసిన మన ముఖ్యమంత్రిని మళ్ళీ ఒక్కసారి గెలిపించుకుందామన్నారు. బీడీల పెన్షన్ దేశంలో ఎక్కడ ఇవ్వడం లేదు.. మన రాష్ట్రంలో నాలుగున్నర లక్షల బీడీల పెన్షన్ ఇస్తున్నాం.. పెన్షన్ రాని వాళ్లకు నెల రోజుల్లో ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు మనం చేసే అభివృద్ధి కనబడడం లేదని మండిపడ్డారు. డిసెంబర్ 3 తర్వాత కోడల్లకు సౌభాగ్య లక్ష్మి అని పేరుతో నెలకు 3000 పెన్షన్ ఇస్తామని తెలిపారు. 2014 లో నరేంద్రమోడీ జన్ ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తా అన్నాడు చేశాడా అని ప్రశ్నించారు…?. డిసెంబరు 3 తర్వాత సిలిండర్ రూ. 400 వందలకే ఇస్తాం.. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.
CM KCR: దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..? మనకు కత్తులు దొరకవా..?
మరోవైపు.. దేశంలో 24 గంటల కరెంటుతో దేశానికే అన్నం పెట్టేలా నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు కేసీఆర్ ధీమా 5 లక్ష భీమా అమలు చేస్తాం..గల్ఫ్ లో ఉన్న వాళ్లకు 5 లక్షల భీమా, గల్ఫ్ వెళ్లే వాళ్లకు 5 లక్షలతో కొత్త పథకం తీసుకొస్తాం.. చెరువులో భూములు కోల్పోయిన వాళ్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని అన్నారు. అలాగే.. కొత్త మండలాలకు కొత్త భవనాలు, తహసిల్దార్ కార్యాలయాలు కట్టిస్తాం.. వీర్నపల్లిలో కొత్త హాస్పిటల్ కట్టిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పోడు భూములకు పట్టా ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.. రానీ వాళ్లకు కూడా ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు ఓటు వేయాలి.. ఏం పీకిండు అని ఓట్లు వేయాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే పట్వారి వ్యవస్థ తీసుకొస్తారని.. అసైన్డ్ భూములకు పట్టాలు, హక్కులు కల్పిస్తారని విమర్శించారు.