Telangana Governor Tamilisai Said I am happy to speak Telugu: తెలంగాణ భాష ‘క్లాసిక్ భాష’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని గవర్నర్ పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని గవర్నర్ తమిళిసై చెప్పారు. రవీంద్ర భారతిలో…
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి “సంసద్ మహారత్న” అవార్డు వరించింది. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కింది. మాజీ చైర్మన్ టీజీ. వెంకటేష్ తో కలిపి అవార్డు…
పద్మవిభూషణ్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అభినందించారు. గవర్నర్ ఆహ్వానంతో ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి, సురేఖ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవికి శాలువా కప్పిన గవర్నర్ తమిళిసై... ఆయన పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. చిరంజీవి సామాజిక సేవలని ప్రస్తావిస్తూ, పద్మవిభూషణ్ పురస్కారం పొందినందుకు అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Telangana: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వై జరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి.
ఒక విజన్ లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏ చేస్తుందొ గవర్నర్ ప్రసంగంలో ఉండాలన్నారు. ఆసరా పెన్షన్ , మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తామో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది..
గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశలు రేపటికి వాయిదా పడ్డాయి. దీంతో రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుండగా.. ఈ నెల 10వ తారీఖున తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు.
రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కాగా.. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరుకాగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం హాజరు కాలేదు.
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో తేనేటి విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఎట్‌హోం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ప్రోగ్రామ్‌కి అధికార, ప్రతిపక్ష నేతలను గవర్నర్ ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో జరిగి ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాజ్‌భవన్ సుందరంగా ముస్తాబైంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గులాబీ పార్టీ నేతలు హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్…
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు సభ్యుల రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.. అయితే, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు.