Vastu Tips For Water Fountain in Home: సాధారణంగా ఇంటి అలంకరణ కోసం జనాలు చాలా వస్తువులు కొంటుంటారు. ఎక్కువగా షోపీస్‌లను ఇంట్లో ఉంచడానికి ఇష్టపడుతారు. కొంతమంది ఇంట్లో ఫౌంటైన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఫౌంటైన్‌ను ఏర్పాటు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఫౌంటైన్‌లో ప్రవహించే నీరు.. డబ్బు, ఆనందం మరియు ప్రేమకు ప్రతీకగా చెప్పబడుతుంది. మీ ఇంటిలో మరియు చుట్టుపక్కల దీన్ని ఉంచడం వల్ల అదృష్టం మరియు సానుకూలతలు పెరుగుతాయి.
మీ ఇంట్లో లేదా ఇంటి ఆవరణంలో వాటర్ ఫౌంటైన్‌ను ఏర్పాటు చేయడం వలన ఇంటి అందం పెరుగుతుంది. అంతేకాదు ఇంటి చుట్టూ నీరు ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం నీటి ఫౌంటైన్ సరైన దిశను మరియు స్థానాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఫౌంటైన్ ఎక్కడ పెట్టాలో (Right Placement of Water Fountain as per Vastu) ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దిశలో ఫౌంటైన్‌ను ఉంచాలి (Water Fountain for Home Vastu):
# వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఫౌంటైన్ ఉంటే చాలా మంచిది. ఇంటి మెయిన్ గేట్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అందుకే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద వాటర్ ఫౌంటైన్‌ను ఉంచడం వల్ల డబ్బుతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
# ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఫౌంటైన్‌ను పెట్టాలి. ఉత్తర దిశను కుబేరుడిగా పరిగణిస్తారు. ఈ దిశలో ఫౌంటైన్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఇంటిపై కుబేరుడి ఆశీస్సులు ఉంటాయి. అప్పుడు ధన, ధాన్యాలకు లోటు ఉండదు.
# ఇంట్లో వాటర్ ఫౌంటైన్‌ను పెట్టుకోవాలంటే కుడి మూలలో పెట్టుకోమని వాస్తు నిపుణులు చెపుతున్నారు. ఈ మూలలో ఉంచితే విశ్వంలోని పాజిటివ్ శక్తి అంతా మీ ఇంటికి వస్తుంది.
# వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి దక్షిణం, ఆగ్నేయం లేదా పడమర దిశలో ఫౌంటైన్‌ను ఏర్పాటు చేయడం అశుభం. ఈ దిశలో ఫౌంటెన్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లోని సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
Also Read: ICC World Cup 2023: సచిన్ కోసం 2011 ప్రపంచకప్ గెలిచాం.. 2023 ట్రోఫీ అతడి కోసం గెలవండి: సెహ్వాగ్
ముఖ్యమైన విషయాలు:
#ఇంట్లో ఫౌంటైన్‌ను ఏర్పాటు చేశాక నీటి ప్రవాహం ఎప్పుడూ ఆగకూడదు. ఇది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.
# వాస్తుశాస్త్రం ప్రకారం పడక గదిలో వాటర్ ఫౌంటైన్‌ను ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేస్తే వివాదాలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
# వాస్తుశాస్త్రం ప్రకారం ఫౌంటైన్‌లో మురికి ఉండకూడదు. ఫౌంటైన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.