ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ కాన్ ఖాన్ అనే యువకుడు వెరైటీ ట్వీట్ చేశాడు. తన భార్యకు దోమలు కుడుతున్నాయి.. దీంతో భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. మస్కిట్ కిల్లర్ కావాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. దీంతో అతని ట్విట్ కు రియాక్ట్ అయిన పోలీసులు అతనికి ఓ మస్కిటో కిల్లర్ ను తెచ్చి ఇచ్చారు. సదరు వ్యక్తి పోలీసులు చేసిన హెల్ప్ కు ధన్యవాదాలు తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. అసద్ ఖాన్ భార్యకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను చందౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేర్పించాడు. అదే రాత్రి ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
Also Read : Elephant : క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతున్న ఏనుగు..
అయితే సదరు ఆస్పత్రిలో విపరీతంగా దోమలు ఉన్నాయి. అవి అసద్ ఖాన్ భార్యను.. కూతురిని తీవ్రంగా కుడుతున్నాయి. దీంతో చిన్నారి ఏడవటం ప్రారంభించింది. వారి బాధను చూడలేని అసద్ ఖాన్.. మస్కిటో కిల్లర్ కోసం బయటకు వెళ్లాడు.. అర్థరాత్రి కావడం వల్ల దుకాణాలన్ని మూసి ఉన్నాయి. ఇక చేసేది లేక మస్కిటో కిల్లర్ కావాలని కోరుతూ యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు. ఈ రోజు నా భార్య చందౌసిలో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ లో చిన్నారికి జన్మనిచ్చింది. ఇక్కడ నా భార్య, కూతురు చాలా ఇబ్బందులు పడుుతున్నారని అన్నాడు. ఇప్పటికే నా భార్య తీవ్రమైన నొప్పితో బాధపడుతుంది. దానికి తోడు దోమలు కూడా వీపరీతంగా కుడుతున్నాయి.. దయచేసి నాకు ఓ మస్కిటో కిల్లర్ ను తెచ్చి ఇవ్వండి అంటూ యూపీ పోలీసులకు అసద్ ఖాన్ ట్విట్టర్ లో రిక్వెస్ట్ చేశాడు.
Also Read : Yv Subbareddy: ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభం
దానికి సంభల్ పోలీసులకు, డయల్ 112 ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశాడు. అయితే పోలీసులు ఈ ట్వీట్ పై మానవీయ కోణంలో స్పందించారు. వెంటనే అసద్ ఖాన్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చి అసద్ ఖాన్ కు మస్కిటో కిల్లర్ ను అందించారు. మాఫియా నుంచి మస్కిటో వరకు దేన్నైనా ఎదుర్కొంటాం అని ట్విట్టర్ లో యూపీ పోలీసులు పోస్ట్ చేశారు. పోలీసుల సహాయానికి అసద్ ఖాన్ ధన్వవాదాలు తెలిపాడు. యూపీ పోలీసులు చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం అసద్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.