ఏప్రిల్ మాసం చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభిస్తాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇక పై నిరంతరాయంగా కొనసాగిస్తాం అన్నారు. ఒంటిమిట్టలో ఏప్రిల్ 5వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం నిర్వహిస్తాం అని చెప్పారు. శ్రీరాములవారి కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం తరపున సియం జగన్ పట్టువస్ర్తాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏఫ్రిల్,మే,జూన్ మాసంలో భక్తులు రద్ది దృష్యా విఐపి సిఫార్సు లేఖలు జారి చేసే వారు నియంత్రణ చేసుకోవాలి అన్నారు.
విఐపి బ్రేక్ దర్శవ సమయ మార్పు విధానాన్ని కొనసాగిస్తాం అని తెలిపారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తాం. త్వరలోనే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సియం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తాం అని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. గత నెల 15వ తేదిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం అని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మె్ల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చెయ్యలేదు.
Read Also:Elephant : క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతున్న ఏనుగు..
2023-24 సంవత్సరానికి 4411 కోట్ల అంచనాతో బడ్జెట్ కి ఆమోదం తెలిపామన్నారు. శ్రీవారి భక్తులు సౌకర్యర్దం 5.25 కోట్ల రూపాయల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. తమిళనాడు రాష్ర్టం ఉల్లందురు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా 4 కోట్లు కేటాయించామన్నారు. యస్ జి యస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు 4.71 కోట్లు కేటాయించామన్నారు. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు,విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. మరోవైపు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 2 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 57,559 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,157 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లుగా తెలిపింది టీటీడీ.
Read Also:Kadapa Muslim Bhakthulu: దేవుని కడపలో ముస్లింల ఉగాది పూజలు