బీఆర్‌స్ తప్పులు ఒప్పుకోని కాళేశ్వరం విజిట్ మానుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. శ్వేతపత్రంలో కాళేశ్వరంలో జరిగిన తప్పులను వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా బిఅరెస్ నేతలు తప్పులు ఒప్పుకోని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు చెయ్యరు, నిపుణుల కమిటీ నివేదికే ఫైనల్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో జరిగింది చిన్నపోరాపాటు కాదన్నారు. కాళేశ్వరం కట్టి నష్టపరిస్తే, పాలమూరు రంగారెడ్డి ని కట్టకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసారని, కోటి ఏకరాలకు నీళ్లు అంటూ బిఅరెస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు, లక్ష ఏకరాలకు కూడా నీరు అందలేదన్నారు.
అంతేకాకుండా..’దొంగే దొంగ అని అరిచినట్లు బిఅరెస్ నేతల వ్యవహారశైలి ఉంది. తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయాన్ని ఎవరు మర్చిపోలేదు. ప్రభుత్వం వచ్చి 80 రోజులే అవుతుంది,ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పులను సరిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. మా ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు, తప్పు చేసి తప్పును ఒప్పుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జరిగిన తప్పును కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. తప్పు ఒప్పుకోకపోవడం కేసీఆర్ రాచరికనికి నిదర్శనం. ఎవరుపోయిన జరిగిన తప్పులనే చూపించాల్సి ఉంటుంది. నిపుణులైన ఇంజనీర్లు కాకుండా కేసీఆర్ డిజైన్ చెయ్యడంతోనే కాళేశ్వరం ప్రజలకు భారంగా మారింది. L&T డిజైన్ సరిగలేదని చెప్పిన అప్పటి ప్రభుత్వం వినిపించుకోలేదు.’ అని మల్లు రవి వ్యా్ఖ్యానించారు.