వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలంతా… ఆ ఎంపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎక్కడో స్విచ్చేస్తే… అక్కడ బల్బ్ వెలుగుతోందా..? అన్న-తమ్ముడు అనుకుంటూనే.. ఎందుకు లడాయి పెట్టుకుంటున్నారు? క్రమశిక్షణ అన్నది బ్రహ్మ పదార్ధంలా మారిపోయిందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? కీచులాడుకుంటున్న ఆ నాయకులెవరు? ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్‌కి చేరింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు ఆందోళన, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుల దాకా వచ్చేసింది వ్యవహారం. ఎంపీ మల్లు రవి టార్గెట్‌గా… పాలమూరు…
TPCC Mahesh Goud : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్‌లో ఆంతర్య విభేదాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిపై ఆయన పార్టీ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్ర ఆక్షేపాలు చేశారు. పార్టీ క్షమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న మల్లు రవి, పార్టీ లైన్‌ను దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయ్‌తో కలసి తిరుగుతున్నారని సంపత్ ఆరోపిస్తూ, ఈ విషయాన్ని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. Gautam Gambhir: “రోడ్‌షోలు…
ఆ కాంగ్రెస్ ఎంపీ… బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో ఎందుకు భేటీ అయ్యారు? అధికారిక కార్యక్రమం అయ్యాక ప్రైవేట్ మీటింగ్ మతలబేంటి? ఎమ్మెల్యే కారు దిగేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఎంపీ టూర్ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌ని బయటపెట్టిందా? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? వాళ్ళ మీద రూమర్స్ ఎందుకు మొదలయ్యాయి? నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయ్యాక తొలిసారి గద్వాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు,…
Mallu Ravi : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రేపటితో (జూన్ 2) 11వ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మల్లు రవి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలను వివరించారు. మల్లు రవి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గత ప్రభుత్వాలు…
ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని బాంబ్ పేల్చారు. ముగ్గురు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. కెసిఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. Also…
గెలుపునకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమి కూడా సమిష్టి బాధ్యత అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల ఓటమిపై ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ…
Mallu Ravi : కాంగ్రెస్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టింది కేటీఆర్ కాదా? అని ఆరోపించారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో, నూతన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్…
R. Krishnaiah: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సమావేశం అయ్యారు. విద్యా నగర్‌లోని కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ రవి, కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు.