హనీ రోజ్ ప్రస్తుతం టాలీవుడ్ తన వైపు చూసేలా చేసిన హంస.. వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించిన ఈ బ్యూటీకి బాలయ్య మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్య తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. కాగా ఈ మూవీలో కూడా హనీరోజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో టాక్.
Also Read : Karnataka: లోపల కాంగ్రెస్ మీటింగ్.. బయట ఫైటింగ్.. బెంగళూర్‌లో టెన్షన్
బాలయ్య 108 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుుతుంది. మంచి అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మలయాళీ కుట్టి.. కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది.
Also Read : CSK vs KKR: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం
హానీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది. హానీరోజ్ 2005లో తన 14వ ఏటనే యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు చిత్రంలో కూడా నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే.
Also Read : Shivam Dube : శివమ్ దూబే దెబ్బకి.. పరుగులు పెట్టిన చీర్ గర్ల్స్
అయితే టాలీవుడ్ లో వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి తెలుగులో ఈ మళయాళి ముద్దుగుమ్మ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో అనేది.