Kolkata Knight Riders Need To Score 145 To Win Against CSK: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులే చేసింది. శివమ్ దూబే (34 బంతుల్లో 48) మినహాయించి చెన్నై బ్యాటర్లలో ఏ ఒక్కరూ ఆశాజనకంగా రాణించలేదు. కాన్వే (28 బంతుల్లో 30) కాస్త పర్వాలేదనిపించాడంతే. కష్టాల్లో ఉన్నప్పుడు దూబేకి జడేజా (24 బంతుల్లో 20) స్టాండ్ ఇచ్చి, జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడ్డాడు. మిగతా బ్యాటర్లందరూ ఈసారి చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్ కేకేఆర్ గెలుపొందాలంటే.. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది.
Shivam Dube : శివమ్ దూబే దెబ్బకి.. పరుగులు పెట్టిన చీర్ గర్ల్స్
తొలుత చెన్నై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. చెన్నై తరఫున ఓపెనింగ్ చేసిన రుతురాజ్, కాన్వే.. నిదానంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఇక కుదురుకున్నారని అనుకునేలోపే.. రుతురాజ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానే ఒక ఫోర్, మరో సిక్స్‌తో జోష్ నింపి.. ఆ వెంటనే వెనుదిరిగాడు. ఆ కాసేపటికే చెన్నై జట్టు వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. 66 పరుగుల వద్ద కాన్వే, 68 పరుగుల వద్ద రాయుడు, 72 పరుగుల వద్ద మోయీన్ అలీ ఔట్ అయ్యారు. అప్పుడు శివమ్ దూబే, జడేజా కలిసి తమ జట్టుని ఆదుకున్నారు. ఓవైపు జడేజా స్టాండ్ ఇవ్వగా, మరోవైపు దూబే పరుగుల వర్షం కురిపించాడు. భారీ బౌండరీలు బాదలేదు కానీ.. సింగిల్స్, డబుల్స్ బాగా తీశారు. వీళ్లిద్దరు కలిసి ఆరో వికెట్‌కి 68 పరుగులు జోడించారు.
Anuj Rawat : డైమండ్ డకౌట్ అయిన రవిచంద్రన్ ఆశ్విన్..
చివర్లో రెండు బంతులు ఉన్నప్పుడు ఎంఎస్ ధోనీ వచ్చాడు కానీ, ఈసారి అతని నుంచి ఎలాంటి మెరుపులు మెరువలేదు. ఒక ఫ్రీ హిట్ దొరికినా, ధోనీ దాన్ని సద్వినియోగపరచుకోలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బౌలర్ వైభవ్ అరోరా యార్కర్ బంతి వేసి ధోనీని బౌల్డ్ చేశాడు. కానీ.. అది ఫ్రీ హిట్ కావడం వల్ల ధోనీ నాటౌట్‌గా నిలిచాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు తీసి, దాంతోనే సర్దుబాటు చేసుకున్నాడు. కేకేఆర్ బౌలర్లలో.. వరుణ్ & సునీల్ చెరో రెండు, వైభవ్ & శార్దూల్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.