Hair Salon Owner Ashok Murder Case Update: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ‘హర్ష లుక్స్’ సెలూన్ యజమాని అశోక్‌ను హత్య చేశారు. అశోక్ ఇంటికి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సెలూన్ తెరిచి చూడగా అతడు శవమై కనిపించాడు. సెలూన్ యజమాని అశోక్ భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు గురైన సెలూన్ నిర్వాహకుడు అశోక్ భార్య నీరజ ఎన్టీవీతో మాట్లాడారు. ‘రోజు మాదిరిగానే నిన్న మధ్యాహ్నం లంచ్ చేసిన నా భర్త సెలూన్‌కు వెళ్లాడు. మా ఇంటి నుండి చూస్తే సెలూన్ కనబడుతుంది. నిన్న సాయంత్రం సెలూన్ క్లోజ్ చేసి ఉంది. దాంతో నేను ఫోన్ చేస్తే.. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నా కొడుకును సెలూన్ దగ్గరికి పంపించా. సెలూన్ దగ్గరికి వెళ్లేసరికి సెటర్ క్లోజ్ చేసి ఉన్నా.. నా భర్త బైక్ అక్కడే ఉన్నట్లు మా అబ్బాయి చెప్పాడు’ అని నీరజ తెలిపారు.
Also Read: England Cricket: ప్రపంచకప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలే.. ఇంగ్లండ్ ఖాతాలో చెత్త రికార్డు!
‘సెలూన్ షట్టర్ ఓపెన్ చేసి చూసే వరకే న భర్త అశోక్ రక్తపు మడుగులో ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. గత కొద్ది రోజులుగా బీహార్‌కు చెందిన పంకజ్ మా సెలూన్‌లో పని చేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడిని పనికి రావొద్దని అశోక్ చెప్పాడు. దీంతో నా భర్తపై కక్ష్య పెట్టుకొని పంకజే హత్య చేశాడు. అశోక్‌కు ఎవరితో గొడవలు, ఆర్థిక లావాదేవీల తగాదాలు లేవు. పంకజే ఈ దారుణానికి ఒడిగట్టాడు’ అని అశోక్ భార్య నీరజ చెప్పారు.