Krishna Water Dispute: ఇవాళ సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
Read Also: Pawan Kalyan: ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై పవన్ క్లారిటీ
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వాయిదా వేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.