జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి చాంబర్ లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. చివరి గింజ వరకు రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. 4.56 లక్షల మెట్రక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారి ని నియమించి కొనుగోళ్ల పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామన్నారు.
Also Read : Junmoni Rabha: “లేడీ సింగం”గా పేరొందిన జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మృతి
రైస్ మిల్లుల వద్ద 24 గంటల వ్యవధిలో ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైస్ మిల్లుల వద్ద తూకంలో కోత పెడితె కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకాల వర్షాల కారణంగా వచ్చిన ఇబ్బందులకు సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. పంట నష్టపోయిన వారికి ప్రతి ఎకరానికి 10 వేల చొప్పున మొదటి విడత మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి సంవత్సరం దాదాపు పదివేల కోట్లు ఖర్చు చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
Also Read : Zomato UPI: యూపీఐ ద్వారా జొమాటో సేవలు.. ఇక సీఓడీకి ముగింపు పలుకనుందా..?