పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనతో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగింది, బీఆర్ఎస్ ప్రతిష్ట అథ:పాతాళానికి దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు ఆ పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తును చూపెడుతుందని, గతిలేకనే కేసీఆర్ – బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. తుంటివిరిగి కేసీఆర్ జ్ఞాపకశక్తి తగ్గిందని, మూణ్ణెళ్లు కూడా పూర్తికాకుండానే నాలుగు నెలలు అంటున్నాడని ఆయన సెటైర్లు వేశారు.
MLA Arani Srinivasulu: రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి వెళ్తున్నాను..
కేసీఆర్ పదేండ్లలో తెలంగాణను సర్వనాశనం చేశారని, కోట్లాది రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని వందేండ్ల వెనక్కి నెట్టే విధ్వంసాన్ని సృష్టించారని అన్నారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ లాగా తాము కూడా కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఆ పార్టీలో కేవలం నలుగురే మిగులుతారని అన్నారు. కేసీఆర్ కు వేరే మార్గం లేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోదీ కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పారు.