కొమురం భీం కాలనీ వాసులు చేస్తున్న పోరాటానికి కోదండరాం మద్దతు పలికారు. కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మావల శివరులోని కొమురం భీం కాలనీలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెల ప్రాంతంలో తుడుం దెబ్బ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని కలెక్టర్ ను మరో సారి కలిసి దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు. వారికి అండగా ఉంటానని.. సీఎంను కలసి సమస్యను విన్నవిద్దామని భరోసా ఇచ్చారు. ఇల్లు అనేది హక్కని.. పేదలు గౌరవంగా బతకాలంటే ఇల్లు తప్పకుండా కావాలని తెలిపారు. అది ప్రభుత్వం కల్పించాలని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పును గుర్తుచేశారు. వారి మద్దతు ఇస్తు్న్నట్లు కోదండ రాం తెలిపారు.
READ MORE: Sandeshkhali: సందేశ్‌ఖాలీ ఘటనలో “ప్రభావవంతమైన” వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్..
ఆ అధికారం అమలు కావాలని ఆశించారు. సుప్రీం కోర్టు చెప్పినట్టుగా ప్రభుత్వం చేయాలని కోరారు. పట్టా కావాలి.. ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పని చేసేలా ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై కొంత మంది అనవసర ప్రచారం చేస్తున్నారన్నారు. పని ఉంటే నే బస్సులో పోతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం పేదలకు పని చేసేలా ఉందన్నారు. ఆలోపు భూమి మీద నుంచి జరగవద్దని స్పష్టం చేశారు. హక్కులు వస్తాయి… నిరాశ పనికి రాదు.. ఐక్యంగా పోరాడితే సాధించ వచ్చని పిలుపునిచ్చారు.