Minister Seethakka : కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలంలోని జంగుబాయి జాతర ఘనంగా జరుగుతున్నది. ఈ జాతరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క గిరిజన సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన మహిళలు గోలుసు, కడియాలు, చీరకట్టులో పాల్గొని తమ సంప్రదాయాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. మంత్రితోపాటు, ఎమ్మెల్యే కొవ్వ లక్ష్మి కూడా ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మంత్రి సీతక్క జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులైన కటోడాలను సన్మానించారు.…
Komaram Bheem: కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు నిచ్చాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతికి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యం కారణమని, బంద్ కు పిలుపు నిచ్చారు. మృతి చెందిన శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని, వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.…
కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత సరిహద్దు 30 కిలోమీటర్ల దూరంలో రెండు రోజుల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు.
కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. మావల శివరులోని కొమురం భీం కాలనీలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెల ప్రాంతంలో తుడుం దెబ్బ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని కలెక్టర్ ను మరో సారి కలిసి దరఖాస్తు ఇవ్వండన్నారు.
చిరుతపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహేగాం మండలం లోహ శివారులో పులి సంచారం గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మూడు వాగుల వద్ద కార్తిక స్నానానికి వెళ్ళిన 20 మంది భక్తులు పరుగులు తీశారు. వారికి పులి ఎదురుపడింది, పులి కదలకపోవడంతో అక్కడే ఆగిపోయారు భక్తులు. పులి కనిపించిన సమాచారాన్ని ఊరిలో ఉన్నవారికి సమాచారం ఇవ్వడంతో వారంతా కదిలి వచ్చారు. గ్రామస్తులు డప్పులు వాయిస్తూ వెళ్ళడంతో పులిక పారిపోయింది. పులి కనిపించిన సమాచారాన్ని అటవీశాఖ…