ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.
Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. వర్షాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో భూములు, భూరికార్డులు కీలకమైనవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.