కేరళ రైలు దహనం కేసులో నిందితుడిపై ఎన్ఐఏ (NIA) ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. నిందితుడు షారుక్ సైఫీ.. రాడికల్ వీడియోలు చూసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. చార్జిషీట్‌లో పలు విషయాలను వెల్లడించింది. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడు ఢిల్లీలోని షాహీన్‌బాగ్ నివాసిగా గుర్తించారు.
Read Also: Sitara Ghattamaneni: బంగారుకొండ సితార.. ముద్దుపెట్టుకున్న బామ్మ.. వీడియో వైరల్
నిందితుడు షారుక్ సైఫీపై IPC, UA(P)A, రైల్వే చట్టం మరియు PDPP చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. NIA ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లోని D1 కోచ్‌కు నిప్పంటించిన షారుక్ సైఫీ ఉగ్రవాద చర్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. ప్రజలను చంపాలనే ఉద్దేశంతో నిందితుడు ప్రయాణికులపై పెట్రోల్ పోసి, బోగీకి లైటర్‌తో నిప్పంటించారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
Read Also: Ayodhya idol: అయోధ్యలోని ఓ రహస్య ప్రాంతంలో తయారవుతున్న రాముడి శిల్పం
తన జిహాదీ పనిని గుర్తించాలని ఉగ్రవాద చర్యకు పాల్పడేందుకు సైఫీ కేరళ వెళ్లినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. అంతేకాకుండా.. హింసాత్మక తీవ్రవాదం, జిహాద్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న వివిధ ఆన్‌లైన్ ప్రచార సామగ్రి ద్వారా నిందితుడు స్వీయ-రాడికలైజ్ అయ్యాడు. భారతీయ, విదేశీ పౌరసత్వం కలిగిన రాడికల్ ఇస్లామిక్ బోధకులచే ఆ విషయం ప్రచారం చేయగా.. ఈ క్రమంలో అతను పాకిస్తాన్‌తో సహా సోషల్ మీడియాలో రాడికల్ ఇస్లామిక్ బోధకులను అనుసరించాడు. అతను ఆన్‌లైన్ ఛాందసవాదాన్ని అనుసరించి జిహాదీ టెర్రర్ యాక్ట్‌గా దహనానికి పాల్పడ్డాడు.