అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది 2024 జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా.. శ్రీరామ నవమి వేడుకలను అయోధ్య రామ మందిరంలో నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామ మందిరంలో ఉండే రాముడి విగ్రహాన్ని ఓ రహాస్య ప్రాంతంలో ముగ్గురు శిల్పులు చెక్కుతున్నారు. రామ మందిర స్థలం నుండి దాదాపు 1.5 కి.మీ దూరంలో ఉన్న రామ్‌సేవక్ పురంలో విగ్రహాన్ని తయారుచేస్తున్నారు.
PM Modi: కాంగ్రెస్ ఆవు పేడను కూడా వదల్లేదు..
అయితే రాముడి విగ్రహం భారీ బందోబస్తు మధ్య శిల్పిస్తున్నారు. అంతేకాకుండా శిల్పాల తయారీ చుట్టూ ఇనుప రేకులు ఏర్పాటు చేసి.. ఎవరికి కనపడకుండా తయారీ చేస్తున్నారు. రాముడి విగ్రహాన్ని చూసేందుకు ఎవరికి వీలు లేకుండా అక్కడ సాయుధ యుపీ పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు భారీ బందోబస్తుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. మూడు వర్క్ షాప్ లలో మూడు రాముడి విగ్రహాలు చెక్కుతున్నారు. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క శిల్పి చెక్కుతున్నారు. ప్రతిష్ట కార్యక్రమంలో అందులో ఏది బాగుంటే దానిని ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు.
Bigg Boss 7: ఒక రేంజిలో ఆడుకున్న నాగార్జున… అతను డైరెక్ట్ ఇంటికే?
మరోవైపు రామ మందిరాన్ని నిర్మించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, శిల్పులు మూడు వర్క్‌షాప్‌ల సమాచారాన్ని పంచుకోవడానికి నిరాకరించారు. రామసేవక్ పురంలో మూడు విగ్రహాలను తయారు చేస్తుండగా.. విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధీనంలో మూడు వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేశారు. అవి దీర్ఘచతురస్రాకారంలో ఉండగా.. దాదాపు 15 అడుగుల ఎత్తైన గోడలు టిన్ షీట్‌లతో తయారు చేశారు.
Lake Front Park: హైదరాబాద్ లో రేపటి నుంచి అందుబాటులోకి లేక్ ఫ్రంట్ పార్క్..
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రస్ట్ నిర్మాణ కమిటీ అధిపతి నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. 51 అంగుళాల విగ్రహం తయారు చేస్తున్నామని, రాముడిని చిన్నపిల్లవాడిగా కమలంపై నిలబడి ఉన్నట్లు చెప్పారు. మరోవైపు శిల్పులు పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తున్నందున విగ్రహాల తయారీకి సమయం పడుతుందని రామ్‌సేవక్ పురం వర్గాలు తెలిపాయి. ఈ మూడు విగ్రహాలు అక్టోబర్ లో పూర్తి అవుతాయని తెలిపారు. రాముడి శిల్పాలను తయారు చేసే.. శిల్పులు బెంగళూరు, మైసూర్, జైపూర్ నుండి వచ్చారు. అయితే వారు ఎవరితో మాట్లాడరు. విగ్రహాల వివరాలను ఎవరికి చెప్పరు. అంతా సీక్రెట్ గా విగ్రహాల తయారీ చేయిస్తున్నారు.
Madam Chief Minister: దర్శకనిర్మాతే హీరోయిన్ గా ‘మేడం చీఫ్ మినిస్టర్’
శిల్పాలను చెక్కే స్థలంలో రామ్ కథా కుంజ్ వద్ద.. అయోధ్య నుండి లంక వరకు శ్రీరాముని జీవితంలోని వివిధ దశలను వర్ణించే 151 శిల్పాలను రూపొందిస్తున్నారు. పక్కనే ఉన్న వర్క్‌షాప్‌లో రాముడి విగ్రహం తయారవుతుంది. అయితే అక్కడికి శిల్పి తప్ప మరేవరు వెళ్లరు. ఈ వర్క్‌షాప్ నుండి 150 మీటర్ల దూరంలో రెండవ టిన్-షీట్ నిర్మాణం ఉంది. అక్కడ రెండవ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు రామ్ సేవక్ పురం వర్గాలు తెలిపాయి.