Sambhal Violence : సంభాల్ హింసపై సిట్ దర్యాప్తు పూర్తి చేసింది. ఆ బృందం వెయ్యి పేజీలకు పైగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్, సదర్ ఎమ్మెల్యే కుమారుడు సుహైల్ ఇక్బాల్ సహా 37 మంది నిందితులు నిందితుల్లో ఉన్నారు
అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. అలాగే.. 4,141 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Prajwal Revanna : జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, ఆయన తండ్రి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న సిట్ రెండు వేల పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో యూపీ ఎస్టీఎఫ్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధాన సూత్రధారి రవి అత్రి సహా 18 మంది నిందితులపై ఎస్టీఎఫ్ మీరట్ యూనిట్ 900 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో ఉంటున్న విషయం విదితమే.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో చార్జిషీట్ ను ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను పేర్కొంది. కాగా.. నారా లోకేష్ , లింగమనేని రమేష్, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్…
PFI నిజామాబాద్ కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది. యువతను ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు చేర్చుకోవడం.. తీవ్రవాదం చేయడం మరియు శిక్షణ ఇవ్వడంపై నొస్సామ్ మహ్మద్ యూనస్‌పై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలైంది. దీంతో.. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 17కి చేరింది. 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే PFI కుట్రను కొనసాగించడానికి హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే PFI…
కేరళ రైలు దహనం కేసులో నిందితుడిపై ఎన్ఐఏ (NIA) ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. నిందితుడు షారుక్ సైఫీ.. రాడికల్ వీడియోలు చూసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. చార్జిషీట్‌లో పలు విషయాలను వెల్లడించింది.
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది.