Janasena Party: జనసేన పార్టీకి ఎన్నికల గుర్తును ‘గాజు గ్లాసు’ గుర్తును ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టు జనసేన వెల్లడించింది. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఉత్తర్వులకు సంబంధించిన కాపీలను.. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందించారు పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్.. కాగా, జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించవద్దని గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.. గుర్తింపు పొందని పార్టీలకు వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒకే గుర్తు కేటాయించకూడదని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.. అయితే, 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెబుతూ.. మళ్లీ గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది సీఈసీ.
Read Also: Chiranjeevi: విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా సినిమాలు చేస్తున్నారు