నల్లగొండ జిల్లాలో వీఆర్వోలకు రీ- అలాట్మెంట్ ఆర్డర్స్, జూనియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్‌ను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ పథకం చేపడితే కూడా కేసులు వేశారు కొంత మంది దుర్మార్గులు అని ఆయన మండిపడ్డారు.
Also Read : Mr. Pregnant: నైజాంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను డెలివర్ చేస్తున్న మైత్రీ మూవీస్
నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు గోదావరి నీళ్లు అందిస్తున్నామని, దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగు నీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టు పైనా కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసులు వేస్తున్నారని, తెలంగాణను 60 ఏళ్ళు కాంగ్రెస్, బీజేపీలు సర్వ నాశనం చేసాయన్నారు. వీఆర్‌ఏల కష్టాలు అన్నీ ఇన్ని కావని, అందుకే ముఖ్యమంత్రి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకొని రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. ఇవన్నీ ప్రజలు ఆలోచన చేయాలి విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిలు చిత్తశుద్ధితో పని చేసి పల్లెలను అందంగా తీర్చిదిద్దారు. అదే స్ఫూర్తితో పని చేస్తూ తెలంగాణకు పేరు తీసుకురావాలన్నారు.
Also Read : Ambati Rambabu: శునకానందం పొందొద్దని నీ మాజీకి చెప్పు.. రేణు దేశాయ్ కు అంబటి వార్నింగ్