Ambati Rambabu: శునకానందం పొందొద్దని నీ మాజీకి చెప్పు.. రేణు దేశాయ్ కు అంబటి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కితున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ నేత అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యామ్ బాబు అనే పాత్రను తీసుకొచ్చారని, కావాలనే ఆ పాత్రను తనను అగౌరపర్చడానికే సృష్టించారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇక ఈ విషయమై అంబటి ఢిల్లీ వరకు వెళ్ళాడు. అంతేకాకుండా ఒక ప్రెస్ మీట్ లో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఒక సినిమా తీస్తానని డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. అయితే అంబటి వ్యాఖ్యలపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించింది. తన మాజీ భర్త పవన్ సినిమా, రాజకీయాల గురించి మాట్లాడింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేస్తూ.. ” తన మాజీ భర్త, భార్యల గురించి నలుగురు పిల్లల గురించి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడానికి కొంతమంది రెడీ అయ్యారని నాకు సమాచారం అందింది. వారందరికీ ఒక విన్నపం. ఇలాంటి వాటిలోకి పిల్లలను లాగకండి. ఒక సినిమా స్టార్ కి రాజకీయంగా ఎదుగుతున్న ఒక వ్యక్తికి వారు పిల్లలు కాబట్టి వారు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. వారు ఇంకా ఇప్పుడు పిల్లలే కదా, వాళ్లు రాజకీయాల్లో చేయాల్సిందేమీ లేదు రాజకీయంగా జరుగుతున్న విషయాల్లో వాళ్ళు వేలు పెట్టలేదు కదా. నేనొక తల్లిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యాన్స్ కానివ్వండి.. హేటర్స్ కానివ్వండి.. సపోర్టర్స్ కానివ్వండి.. దయచేసి పిల్లల్ని ఇందులోకి లాగొద్దు” అంటూ చెప్పుకొచ్చింది.
Renu Desai: పవన్ మూడు పెళ్ళిళ్ళపై సినిమా.. వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్
Also Read
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
అంతేకాకుండా అలాగే సమాజానికి ఆయన ఉపయోగపడతారని కూడా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. ఆయనకు డబ్బు మీద యావలేదని కేవలం ప్రజలందరూ బాగుండాలని కోరికతోనే రాజకీయాల్లో ఉన్నారని తాను నమ్ముతున్నాను కాబట్టి పొలిటికల్ గా ఆయనకు సపోర్ట్ చేస్తానని ఆమె తెలిపింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. తాజాగా ఈ వీడియో పై అంబటి రాంబాబు స్పందించాడు. రేణుకు అంబటి కౌంటర్ ఇచ్చాడు. “అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి.. ఈ ట్వీట్ పై పవన్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు
మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !— Ambati Rambabu (@AmbatiRambabu) August 10, 2023
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!