Pakistan: ఈజిప్ట్ ‘‘షర్మ్ ఎల్ షేక్’’లో గాజా శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్, హమాస్ సంతకాలు చేశాయి. దీనికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలు దేశాధినేతలు హాజరయ్యారు. అయితే అన్నింటి కన్నా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ట్రంప్‌ను పొగుడుతున్న వీడియో తెగ వైరల్ అయింది. అమెరికా అధ్యక్షుడిని ‘‘శాంతి దూత’’ అని షరీఫ్ ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ట్రంప్‌కు పాకిస్తాన్ ప్రధాని థాంక్స్ తెలిపారు.
Pakistan: పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది.
Netanyahu: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రకంగా చెప్పాలంటే అవమానం. శుక్రవారం ఆయన ప్రసంగించే సమయంలో చాలా దేశాల ప్రతినిధులు, రాయబారులు సామూహికంగా వాకౌట్ చేశారు. గాజాలో ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. నెతన్యాహూ ప్రసంగం కొనసాగుతుంటేనే ఒక్కొక్కరుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాపై దాడిని తీవ్రతరం చేసింది. గాజాలో భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయిలీ బందీలకు తుది ‘‘వీడ్కోలు’’ అంటూ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో జీవించి ఉన్న, చనిపోయి ఉన్నవారి ఫోటోలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రతీ ఒక్కరిని ‘‘రాన్ అరాద్’’గా అభివర్ణించింది. రాన్ అరాద్ అనే పేరు 1986లో అదృశ్యమైన ఇజ్రాయిల్ వాయుసేన అధికారిని గుర్తు చేస్తోంది. ఆయన అదృశ్యం…
Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక…
Israel: ఇజ్రాయిల్ సైన్యంలో అన్ని రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్‌లోని సైనికులు, అధికారులు ఇస్లాం గురించి అధ్యయనం చేయడం, అరబిక్ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. అక్టోబర్ 07, 2023 నాటి నిఘా వైఫల్యం తర్వాత, మరోసారి అలాంటి దాడి జరుగొద్దని భావిస్తున్న ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
Israel PM Netanyahu: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంపై టెల్ అవీవ్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇంకా ముగియలేదన్నారు.
Greta Thunberg: హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ని ఇజ్రాయిల్ బహిష్కరించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆమెకు ప్రాతినిథ్యం వహిస్తున్న హక్కుల సంఘం మంగళవారం ప్రకటించాయి. గాజాకు వెళ్లే ఓడను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ‘‘గ్రెటా థన్‌బర్గ్ ఫ్రాన్స్‌కు విమానంలో ఇజ్రాయెల్ నుండి బయలుదేరుతోంది" అని ఎక్స్‌లో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Israel Hamas War: అక్టోబర్ 07, 2023లో ఏ క్షణాల హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేశారో అప్పటి నుంచి ఆ ఉగ్రసంస్థతో పాటు గాజాలోని ప్రజలు జీవితం దుర్భరంగా మారింది. గత ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయిల్ హమాస్ అంతం కోసం గాజాపై దాడులు చేస్తూనే ఉంది. హమాస్ అక్టోబర్ 07 నాటి దాడుల్లో 1200 మందిని హతమార్చడంతో పాటు 250 మందిని బందీలుగా గాజా స్ట్రిప్‌లోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం…
Israel:గాజాలో ఇజ్రాయిల్ విధ్వంసం సృష్టిస్తోంది. దక్షిణ గాజాలోని రఫాలో యూఎస్ నిధులతో నడిచే ఒక సహాయక పంపిణీ కేంద్రం సమీపంలో ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. 115 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం వేలాది మంది పాలస్తీనియన్లు సహాయక కేంద్రం వద్ద గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇజ్రాయిల్ ట్యాంకులు జనంపైకి కాల్పులు జరిపినట్లు పాలస్తీనా జర్నలిస్టులు చెబుతున్నారు. మృతులను, గాయపడిన వారిని గాడిద బండ్లపై సంఘటనా…