More than 100 people died in Iraq Fire Accident Today: ఇరాక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. మరోవైపు 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు, మీడియా వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చాలా గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయట.
నినెవే ప్రావిన్స్ హమ్దానియా జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరగడంతో వివాహానికి హాజరైన వారిలో 100 మందికి పైగా మృతి చెందారు. మరో 150 మందికిపైగా అతిథులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మంటలు చెలరేగడంతో అతిథులు బయటకు పరుగులు తీశారట. ఆ సమయంలో కిందపడిన వారు మంటలో చిక్కుపోయారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో నూతన వధూవరులు కూడా ఉన్నట్లు సమాచారం. బాగ్దాద్‌కు వాయువ్యంగా 400కిమీ (సుమారు 250 మైళ్లు) దూరంలో హమ్దానియా ఉంటుంది.
Also Read: Health Tips : మద్యం తాగే అలవాటు ఉందా? అయితే మీ పిల్లల్లో ఈ సమస్యలు తప్పవట..
ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 113 మంది మరణించినట్లు నినెవే డిప్యూటీ గవర్నర్ హసన్ అల్-అల్లాక్ ధృవీకరించారు. మంగళవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం సుమారు 10:45 గంటలకు మంటలు ప్రారంభమైనట్లు సమాచారం తెలుస్తోంది. వివాహ వేడుకల సందర్భంగా కాల్చిన బాణసంచానే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు తెలిపాయి. మంటలు చెలరేగినప్పుడు వేడుకలో సుమారు 1,000 మంది ఉన్నట్లు సమాచారం.