అగ్నిప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ఇరాక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఇరాక్‌లోని అల్-కుట్ నగరంలోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మంది మరణించారు. భవనంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్-కుట్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట మంటలు చెలరేగాయి. మంటలు చాలా దూరం వరకు వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపు…
US Missile Strike: ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రసంస్థని అమెరికా చావు దెబ్బ తీసింది. ఇరాన్‌లోని అల్ అన్బర్ ప్రావిన్స్‌లో జరిగిన ఖచ్చితమైన వైమానిక దాడిలో ‘‘అబు ఖదీజా’’ అని పిలిచే అబ్దుల్లా మక్కీ మస్లేహ్ అల్-రిఫాయ్‌ని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. అబు ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్ర సంస్థ రెండవ-కమాండ్ పదవిలో ఉన్నాడు. మార్చి 13న జరిగిన దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు. Read…
ప్రపంచంలోని అనేక దేశాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. మహిళల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాక్ వివాహ చట్టంలో మార్పు గురించి వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. ఇరాక్ ప్రభుత్వం వివాహ చట్టంలో చేయబోయే మార్పుల ప్రకారం.. ఆడపిల్లల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం.
Iran Iraq War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ యుఎవితో ఆర్మీ బేస్‌పై…
హిజ్బుల్లా చీఫ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హత్యకు గురైన తర్వాత ఇరాక్‌లో 100 మందికి పైగా నవజాత శిశువులకు 'నస్రల్లా' అని పేరు పెట్టారు. నస్రల్లా మరణం మధ్యప్రాచ్యంలో ప్రకంపనలు సృష్టించగా, మరోవైపు ఆయన పేరుకు ప్రజాదరణ వేగంగా పెరిగింది. నస్రల్లా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం, ప్రతిఘటనకు చిహ్నంగా పరిగణించబడ్డాడు. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన పేరు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై శుక్రవారం నాడు అర్థరాత్రి భారీ వైమానిక దాడులు జరిగాయి. బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న బాబిల్ ప్రావిన్స్‌లో అర్ధరాత్రి గుర్తు తెలియని విమానం రెండు ఇరాక్ సైనిక స్థావరాలపై బాంబు దాడి చేసింది.
America : జోర్డాన్ దాడిలో ముగ్గురు సైనికుల మృతికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఇరాక్, సిరియాలో అమెరికా విపరీతమైన విధ్వంసం సృష్టించింది. శుక్రవారం ఇరాన్-మద్దతుగల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాలపై అమెరికా సైన్యం భారీ వైమానిక దాడులు చేసింది.
కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. యూఎస్ దళాలు 85 స్థావరాలపై 125కు మించిన యుద్ధ సామగ్రితో దాడి చేశాయి.