తల్లి దండ్రులకు ఎటువంటి అలవాటు ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.. ఇప్పుడు కాకపోయినా పెద్దయ్యే కొద్ది ఆ అలవాట్లను వాళ్లు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు.. అందుకే కొన్ని పనులు పిల్లల ముందు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో నిత్యం దంపతుల మధ్య జరిగే గొడవలు చిన్నారుల మనసత్వంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అలాగే పెద్దలు ఏం చేస్తారో పిల్లుల అదే చూసి నేర్చుకుంటారని తెలిసిందే. ఇక పెద్దల ఆరోగ్యం కూడా చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు..
ఇకపోతే మద్యం అలవాట్లు కనుక మీకు ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు.. పెద్దలు చేసే పనులు చిన్నారులపై ప్రభావం చూపినట్లే వారి అలవాట్లు సైతం దుష్ప్రభావంపై ప్రమాదం చూపుతుందని చెబుతున్నారు. ప్రముఖ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి మద్యం అలవాటు ఉన్నా పిల్లలు మద్యానికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని పరిశోదకులు చెబుతున్నారు..
ఇకపోతే ఆల్కహాల్ అలవాటు ఉన్న వారికి పుట్టే పిల్లల్లో అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఎక్కువ స్థాయిలో శుద్ధి చేసిన కార్బోహైడ్స్, కొవ్వులతో కూడిన ఆహార పదార్థలను తీసుకోవాలన్నా కోరిక అధికంగా ఉంటుందిన నిపుణులు చెబుతున్నారు. ఇవి చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి చిన్నారులు చిన్న వయసులో మధుమేహం, బీపీ, గుండె సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.. అందుకే ఇలా అలవాట్లు ఉన్న పేరెంట్స్ ఇది చదివిన తర్వాత అయిన మార్చుకుంటే బాగుంటుందని అంటున్నారు..
మద్యం తాగే పురుషుల్లో సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విపరీతమైన ఆల్కహాల్ అలవాటున్న మగ వారిలో శుక్ర కణాల నాణ్యత తగ్గుముఖం పడుతుందని, దీర్ఘ కాలంలో ఇది పురుషుల్లో సంతానలేమికి కారణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక స్మోకింగ్ చేసేవారికి ఇంకా ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. సో జాగ్రత్త మిత్రమా..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.