తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు మంత్రి హరీష్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ధ్వజమెత్తారు. తమకు మెడికల్ కాలేజీలు ఇవ్వమని చెప్పిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో కరీంనగర్, ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారని హరీష్ రావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఉన్నదేమీ లేదని, అంతా డొల్ల అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు హరీష్ రావు. పేదల మేలుకు సంబంధించిన ఒక్క అంశం కూడా కేంద్ర బడ్జెట్‌లో లేదని, పైగా కార్పోరేట్‌లకు పన్నులు తగ్గించారని హరీష్ రావు మండిపడ్డారు.
Also Read : Fake Degree: ఫేక్ డిగ్రీతో 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం.. గెజిటెడ్ హోదా.. శిక్ష విధించిన కోర్టు..
రైతుల గురించిగానీ, మహిళల గురించిగానీ, వృత్తుల గురించిగానీ, పేదల గురించిగానీ బడ్జెట్‌లో ప్రస్తావన లేదని, పేదలకు కోతలు పెట్టినారే తప్ప మేలు చేయలేదన్నారు హరీష్ రావు. డీడీ డైలాగ్ పేరుతో గురువారం హైదరాబాద్‌లో దూరదర్శన్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ గురించి పూర్తిగా అబద్ధాలు మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేశారని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడింది నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ఆయన ప్రతి మాట ఆధారాలతో, లెక్కలతో మాట్లాడారని వెల్లడించారు హరీష్‌రావు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉంటే కేంద్రం మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరారు హరీష్ రావు.
Also Read : ‘Katha Venuka Katha’: గుట్టు విప్పిన దర్శకుడు గోపీచంద్ మలినేని!