Fake Degree: ఫేక్ డిగ్రీతో 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం.. గెజిటెడ్ హోదా.. శిక్ష విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Degree case: ఓ వ్యక్తి ఫేక్ డిగ్రీలో ఏకంగా 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. చదివింది పదో తరగతి కానీ..ఏకంగా గెజిటెడ్ అధికారి హోదాను పొందాడు. చివరకు ఈ ఫేక్ బాగోతం బయటపడటంతో కోర్టు అతడికి శిక్ష విధించింది. నకిలీ డిగ్రీని సమర్పించి దాదాపుగా 30 ఏళ్ల పాటు గెజిటెడ్ అధికారి హోదాతో పనిచేసినందుకు మధ్యప్రదేశ్ అగ్నిమాపక శాఖ మాజీ చీఫ్ సూపరింటెండెంట్‌కి ఇండోర్‌లోని స్థానిక కోర్టు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ గుప్తా తీర్పు వెల్లడించారు. దీంతోపాటు నకిలీ అధికారి బీఎస్ టోంగర్ (70)కి రూ.12,000 జరిమానా విధించారు.
Read Also: In Car: నలుగురు రాక్షసుల చేతిలో నలిగిన గులాబీ
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
అగ్నిమాపక శాఖ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు టోంగర్‌పై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఢిల్లీ ప్రభుత్వ విద్యుత్ సరఫరా యూనిట్ లో లోయర్ డివిజన్ క్లర్క్ గా పనిచేసిన బీఎస్ టోంగర్ మధ్యప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి డిప్యూటేషన్ పై వచ్చారు. తన పాత ఉద్యోగ వివరాలను తుడిచిపెట్టిన టోంగర్, నాగ్‌పూర్ లో ఓ కాలేజీలో ఫైర్ ఇంజనీరింగ్ చేసినట్లు నకిలీ డిగ్రీని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించి ఇండోర్‌లోని అగ్నిమాపక విభాగానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా, గెజిటెడ్ అధికారిగా చేరాడు. అయితే 10 తరగతి చదివిన టోంగర్ ఏకంగా ఫేక్ డిగ్రీతో గెజిటెడ్ అధికారి అయ్యారు.
నకిలీ పట్టాతో ఏకంగా టోంగర్ దాదాపు 30 ఏళ్లుగా రాష్ట్రప్రభుత్వంలో పనిచేశాడు. 2013తో పదవీ విరమణి చేశాడు. ఆ ఏడాది అతడిపై ఫేక్ డిగ్రీ ఆరోపణలతో ఛార్జిషీట్ దాఖలైంది. టోంగర్ పై అభియోగాలున రుజువు చేసేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆశ్లేష్ శర్మ 30 మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!