‘Katha Venuka Katha’: గుట్టు విప్పిన దర్శకుడు గోపీచంద్ మలినేని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswanth: కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ ప్రధాన తారాగణం. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం ‘క్రాక్, వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెబుతూ, సినిమా పెద్ద హిట్ కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
75 సెకన్ల నిడివి ఉన్న ‘కథ వెనుక కథ’ టీజర్‌ను గమనిస్తే.. ఓ యంగ్ డైరెక్టర్ (విశ్వంత్) మరో పాత్రకు ఓ క్రైమ్ కథను చెప్పటంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. సిటీలో మిస్సింగ్ కేసులుగా నమోదు అవుతున్న చాలామంది అమ్మాయిలను ఎవరో హత్య చేస్తుంటారు. ఇంత భయంకరమైన హత్యలను చేస్తున్న హంతకుడెవరో పోలీసులకు అంతు చిక్కదు. దీంతో వారు కేసుని సత్య (సునీల్) అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కి అప్పగిస్తారు. సిటీలో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదని, ఓ గ్యాంగ్ కలిసి ఈ హత్యలను చేస్తుందని సత్య తెలుసుకుంటాడు. మరి ఈ విషయాన్ని సత్య ఎలా కనుక్కుకున్నాడు? అతను టీజర్‌లో చెప్పినట్లు మిస్ అయిన ఆ పాయింట్ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
టీజర్‌లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం విశ్వంత్ పాత్ర పజిలింగ్‌గా అందరూ అనుమాన పడేలా ఉంది. మరో వైపు ఇదే క్యారెక్టర్ 2019లో జరిగిన దిశ రేప్, మర్డర్ కేసు గురించి చెప్పటం అప్పుడు ప్రజల్లో నుంచి వచ్చిన ఎమోషనల్ రియాక్షన్స్, దానికి పోలీసులు చూపించిన యాక్షన్ గురించి ప్రస్తావన ఉంది. అసలు వరుస హత్యల వెనుకున్న సీరియల్ లింకును సునీల్ ఏం మిస్ చేసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. సునీల్, విశ్వంత్ పాత్రలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియోను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!