తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఏవిధంగా నష్టపోకుండా ఉండేందుకు వారికి అండగా నిలిచేందుకు చర్యలు చేపడుతుంది. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ జారీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
Also Read : CM YS Jagan: దివ్యాంగులను అక్కున చేర్చుకున్న సీఎం.. ఏడుగురికి తక్షణమే సాయం..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ.. 2022-23 యాసంగి సీజన్ లో పండించిన జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్క్ ఫెడ్ ఎండి చర్యలు చేపట్టాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Also Read : GT vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్
ఈ యాసంగి సీజన్ లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ. 219. 92 కోట్లు తెలంగాణ సర్కార్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జొన్న పంటను కొనుగోలు చేయనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు నిర్ణయంపై రైతన్నలు ధన్యవాదాలు చెబుతున్నారు.