VI Recharge : జియో, ఎయిర్‌టెల్ తర్వాత.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్‌ను ఖరీదైనదిగా మార్చింది. కొత్త ప్లాన్ ధర నేటి నుండి అంటే జూలై 4 నుండి అమలులోకి వచ్చింది. జియో, ఎయిర్‌టెల్ ధరలు పెరిగిన ఒక రోజు తర్వాత ఈ మార్పు చేయబడింది. 2021 తర్వాత టెలికాం కంపెనీలు తమ ప్లాన్‌ల ధరలో ఇంత పెద్ద మార్పు చేసిన తర్వాత ఇది మొదటిసారి. ఈ ధరల పెంపు 5జీ సర్వీసును ప్రారంభించేందుకు కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు వీఐ తెలిపింది. కంపెనీ రాబోయే రోజుల్లో 4G అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని అలాగే 5G సేవను కూడా ప్రారంభించవచ్చని తెలిపింది. Vi ద్వారా ధర పెరిగిన తర్వాత.. 28 రోజుల ప్లాన్ రూ. 199 అయింది. అయితే పాత ధర రూ. 179. కొత్త ధర దాదాపు రూ. 20 పెరిగింది. ఇక VI లో మిగితా ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
HBD M. M. Keeravani : మా ‘ఆస్కారుడు’ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న మెగాస్టార్..
84 రోజుల చౌకైన ప్లాన్ ఇంతకుముందు రూ. 459 ఉండగా ఇది ఇప్పుడు రూ. 509 గా మారింది. ఈ ప్లాన్ లో వినియోగదారులు 6GB ఇంటర్నెట్ డేటాకు యాక్సెస్ పొందుతారు. ఇందులో మీరు అపరిమిత కాలింగ్‌తో పాటు, SMS కూడా ఉపయోగించగలరు. ఇక చొక్క ధరలలో మరో ప్లాన్ వార్షిక ప్లాన్ ధర రూ. 1,999 అయింది. అది ఇదివరకు రూ. 1799 మాత్రమే ఉన్నది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 24GB ఇంటర్నెట్ డేటాను యాక్సెస్ చేస్తారు. ఇది కాకుండా, అపరిమిత కాలింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. జూలై 3 నుండి జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. రెండు టెలికాం కంపెనీలు తమ బేసిక్ ప్లాన్‌ల ధరను పెంచాయి. ఆ తర్వాత ఇప్పుడు Vi కూడా అదే చేయడంతో వినియోగదారులు రీఛార్జ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Mahanandi Temple: మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం!