Leopard at Mahanandi Temple: నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మహానంది క్షేత్రానికి 6 కిమీల సమీపంలోని క్రిష్ణనంది క్షేత్రం వద్ద చిరుత సంచరిస్తోంది. చిరుతను చూసి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఓ గంట తర్వాత మహానంది క్షేత్రంలోని పెద్ద నంది వద్ద చిరుత కనిపించింది. రెండు ఒకటేనా లేదా వేరువేరా అని స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లలో రికార్డ్ అయ్యాయి.
Also Read: CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోడీతో భేటీ!
చిరుతపులి సంచారంతో మహానందికి వచ్చిన భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత కదలికలను యువకులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అటవీ అధికారులు కృష్ణ నందికి వెళ్లి చిరుత పాదముద్రలు సేకరించారు. చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా చిరుతపులి మహానంది క్షేత్రం పరిసరాల్లో తిరుగుతోంది. ఇప్పటికే కామేశ్వరి దేవి సత్రం, అన్నదాన సత్రం దగ్గర చిరుత కనిపించింది. ఆలయం పరిసర ప్రాంతాలలో చిరుత తిరుగుతున్నా.. అటవీ అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.