తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం.. 15 రోజుల లోపు ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాను సమర్పిస్తూ.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖలు పంపించారు. కాగా.. వారి రాజీనామాలను ఆయన ఆమోదించారు.
Read Also: Free Bus Services: ఉచిత బస్సు ప్రయాణం.. హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
ఇదిలాఉంటే.. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి 2021లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. వారి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. మరోవైపు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2015, 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయన పదవీకాలం కూడా 2027 వరకు ఉంది. ఇప్పుడు వీరు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.