Chandrababu: తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారు.. ఎక్కడ చూసినా హృదయ విదారకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. పర్చూరు మండలం చెరుకూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. మురికి కాలువలో మురికి తీయాలన్న బుద్ధి, జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలన్నారు. రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వచ్చి గాల్లో తిరిగి గాల్లోనే వెళ్లిపోయాడని విమర్శలు గుప్పించారు.
Read Also: RK Roja: తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదు.. జగనన్నే వన్స్ మోర్..
Also Read
ఒక వ్యక్తి అహంకారానికి రైతులు బలైపోయారని ఆయన పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే నలుగురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారని.. ఎగువన ప్రాజెక్టులు కట్టడం వల్ల కృష్ణా నదిలో నీళ్లు తగ్గాయన్నారు. గత ప్రభుత్వంలో పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క రోడ్డు బాగుందా.. అన్ని వ్యవస్థలు నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు మళ్లీ కొట్టుకుపోయింది.. గుండ్లకమ్మ గేటు కూడా కాపాడలేని ముఖ్యమంత్రి దద్దమ్మ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి ఎవరు కారణం అంటూ ఆయన ప్రశ్నించారు.
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఎవరు కారణం అని అడుగుతున్నామన్నారు. గేట్లు రిపేరు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అంటూ ఎద్దేవా చేశారు. రెండు టీఎంసీల నీళ్లు గుండ్లకమ్మ నుంచి సముద్రంలోకి వెళ్లాయి అది నా బాధ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక పైన ఉన్న ప్రేమ రైతులపై, అభివృద్ధిపై లేదన్నారు. రైతుల బాధ పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు ఎలా క్షమిస్తాడని.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా తగ్గించి ఇస్తున్నారన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయిందన్నారు. రైతులు తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చంద్రబాబు తెలిపారు. రైతు రాజ్యం తీసుకురావడానికి టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తుపాను కారణంగా భారీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి కేంద్రాన్ని సాయం కూడా అడగలేదన్నారు. ఏపీకి సాయం కోసం ప్రధానికి నేనే లేఖ రాస్తానని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు