ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గత రాత్రి కన్నుమూశారు. కానీ ఆయన భారతీయుల మదిలో ఎప్పటికీ బతికే ఉంటారు. టాటా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే షరతులతో కూడిన ఆహ్వానం పంపించింది. దీంతో వైద్యులు చర్చలకు వచ్చేందుకు నిరాకరించారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సునీత తెలిపింది.
బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. భారత్- శ్రీలంక మధ్య 3 టీ20 ఇంటర్నేషనల్, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అయితే.. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వనిందు హసరంగ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధృవీకరించింది.
కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం తన పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు.