ఉక్రెయిన్‌పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంబించారని, భారత్ పై ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తెలిపారు. జేడీ వాన్స్ మాట్లాడుతూ.. రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య…
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు.
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా నరేంద్ర మోడీ అధికార నివాసానికి వెళ్లారు జేడీ వాన్స్. వారికి మోడీ ఘన స్వాగతం పలికారు. స్వయంగా వారిని లోపలికి ఆహ్వానించారు. గత ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రకటించిన ‘ఇండియా-అమెరికా టెక్నాలజీ పార్ట్ నర్ షిప్ ట్రస్ట్’ ను వీరు ప్రారంభిస్తారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వీరిద్దరూ చర్చించబోతున్నారు. ఆర్థిక,…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటన వేళ.. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ "వాన్స్ గో బ్యాక్.. భారతదేశం అమ్మకానికి లేదు" అనే నినాదంతో అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు నిరసన కార్యక్రమం…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం సోమవారం ఉదయం పాలం ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్-అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వైర్యం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు జేడీ వాన్స్‌కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మస్క్ తీరును తీవ్రంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది.
ఎలాన్ మస్క్ 2002లో అమెరికా పౌరసత్వం పొందారు. చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. ఆయన తనను తాను హాఫ్-డెమొక్రాట్, హాఫ్ రిపబ్లికన్ అనీ, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకునేవారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లకు ఓటు వేశానని, అంతేకాకుండా జో బైడెన్‌కు అయిష్టంగానే ఓటు వేశానని మస్క్ చెప్పారు. కానీ కొన్నేళ్లుగా ఆయన డోనల్డ్ ట్రంప్‌కు మద్దతిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రచారానికి ప్రధాన మద్దతుదారులలో ఒకరిగా ఉన్నారు.