అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. తనకు తానుగా వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఈ మధ్య పదే పదే ట్రంప్ మాట్లాడుతూ తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నారు. గత ఏడాదంతా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ యుద్ధం చేయగా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా వెళ్తున్నారు.
నెతన్యాహు ప్రధానిగా లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండేదే కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సోమవారం ఫ్లోరిడాలో ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కలిశారు. గాజా కాల్పుల విరమణ ప్రణాళిక తదుపరి దశకు వెళ్లే అంశంపై ట్రంప్‌తో నెతన్యాహు చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పేరు మీద ఉన్న ‘ట్రంప్-క్లాస్’ యుద్ధ నౌకలను ఆవిష్కరించారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలుగా పేర్కొన్నారు. ఈ నౌకలు అమెరికా నావికా ఆధిపత్యాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులంతా హాజరయ్యారు. ట్రంప్ ప్రసంగించిన తర్వాత మాట్లాడాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు.
Trump The Peace President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ అతడ్ని ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు టెర్రరిజాన్ని వ్యతిరేకించారు.. కానీ పాకిస్తాన్ ను తప్పుబట్టలేదు అని నారాయణ పేర్కొన్నారు. ట్రంప్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా.. భారత ప్రధాని ఒక్కమాట మాట్లాడడం లేదు.. ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటాడు.. మన ప్రధాని నోరు తెరవడు.. ఎందుకంత భయం.. బానిస లాగా ఎందుకు భావించడం అని అడిగారు.
పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు బలపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించాడు. వైట్‌హౌస్‌లో అసిమ్ మునీర్‌ను ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు. పుతిన్ ఉద్దేశమేంటో అర్థమవుతోందని.. పగలు చాలా అందంగా మాట్లాడతాడని. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతాడని... అలాంటి ప్రవర్తన తనకు నచ్చట్లేదని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.