దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది గాయల పాలయ్యారు. అల్ రస్ ప్రాంతంలో శనివారం జరిగిన దుర్ఘటన. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు భార్యభర్తలు. తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు కూడా ఈ అగ్నిప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోయారు. వీరు భవనంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Nolen: ఓపెన్ హీమర్ సినిమా గురించి వస్తున్న వార్తలనీ పుకార్లే…
ఓ బిల్డింగ్ లో ఫోర్త్ ప్లోర్ లో స్థానికలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.36 గంటలకు మంటలు చెలరేగినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి మధ్యాహ్నం 2.42 గంటలకు మంటల్ని ఆర్పగలిగారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచాన వేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : Brown Rice: రోజూ బ్రౌన్ రైస్ తింటే పొట్ట తగ్గుతుందా? నిజమెంత?
నసీర్ వాటనపల్లి అనే భారతీయ సామిజిక కార్యకర్త.. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారు కుటుంబ సభ్యులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దుబాయ్ పోలీసులు, భారత రాయబారి కార్యాలయం, స్నేహితులతో సమన్వయం చేసుకుంటూ.. వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు.