మైండ్ బెండింగ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ ‘క్రిస్టోఫర్ నొలన్’. ఎంతటి సినీ అభిమానులైనా, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సినీ క్రిటిక్స్ అయినా, ఆఖరికి ఫిల్మ్ మేకర్స్ అయినా సరే ‘క్రిస్టోఫర్ నొలన్’ సినిమాలని ఒకసారి చూడగానే అర్ధం చేసుకోవడం అనేది ఇంపాజిబుల్. ఒకటికి రెండు సార్లు చూస్తేనే నొలెన్ సినిమాలో ఉన్న డెప్త్ అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే మాస్టర్ అని, సినిమా సైంటిస్ట్ అని పేరు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నొలన్, లేటెస్ట్ గా డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఓపెన్‌హీమర్’. అణుబాంబు పితామహుడుగా పేరు తెచ్చుకున్న అమెరికా భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త ‘జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హీమర్’ (Julius Robert Oppenheimer) జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘మర్ఫీ’ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ని నాలుగు నెలల్లోనే పూర్తి చేసిన క్రిస్టోఫర్ నొలన్, మే 2022 నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఓపెన్‌హీమర్’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని నొలెన్, చాలా ఇంటరెస్టింగ్ గా కట్ చేశాడు. సినిమా చూడాలి అనే క్యురియాసిటి పెంచడంలో ఓపెన్‌హీమర్ ట్రైలర్ సక్సస్ అయ్యింది. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకి తప్పకుండ ఆస్కార్ అవార్డ్ వస్తుంది అని సినీ అభిమానుల నుంచి కాంప్లిమెంట్స్ సొంతం చేసుకోవడం క్రిస్టోఫర్ నొలన్ మాత్రమే సాధ్యం అయ్యింది. ఇదిలా ఉంటే 21 జూలై 2023న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో క్రిస్టోఫర్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అయితే ఇంతలోనే ఓపెన్ హైమర్ వాయిదా పడిందన్న వార్తల్లో నిజం లేదు. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెరపైకి వస్తుందని క్లారిటీ ఇచ్చేసారు. దీంతో ఓపెన్ హీమర్ సినిమాని చూడడానికి మూవీ లవర్స్ రెడీ అవుతున్నారు.