పోలీస్ అంటే ఎప్పుడు సీరియస్ గా ఉంటారు.. వాళ్లకు ఎప్పుడు పోలీస్ స్టేషన్, కేసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు అనుకుంటాం.. నిజమే వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారిలో కూడా చాలా నైపుణ్యాలు ఉంటాయి. టైం దొరికితే కొందరు బయట పెడుతుంటారు. ఓ ముంబయి పోలీస్ డ్యాన్సింగ్ టాలెంట్ జనాల్ని ఆకట్టుకుంటుంది.
Also Read : Brown Rice: రోజూ బ్రౌన్ రైస్ తింటే బొట్ట తగ్గుతుందా? నిజమెంత?
పోలీస్ జాబ్ సవాళ్లతో కుడుకున్నది. వాళ్లకి ఓ టైం అంటూ ఉండదు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పట్టించుకోవాలి. ఈ జాబ్ లో ఉన్నవారు ఒక్కోసారి ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయలేదు. అయితే ఓ పోలీస్ కొంచెం టైం దొరికితే చాలు డ్యాన్స్ చేసేస్తారు. ముంబయికి చెందిన అమోల్ కాంబ్లీ తన స్టెప్పులతో అదరగొడుతున్నాడు. అంతకు ముందు ఆయన రణ్ వీర్ సింగ్ పక్కన వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. కాగా.. ఇప్పుడు లేటేస్టుగా వర్కవుట్ చేస్తూ వేసిన స్టెప్పుల్ని రాఘవ్ అనే ఇన్ స్టా గ్రామ్ యూజర్ పోస్ట్ చేయడంలో మరోసారి ఈ వీడియో వైరల్ గా మారింది.
Also Read : AP CM Jaganmohan Reddy: రేపు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సోషల్ మీడియాలో చాలామంది ప్రతిభావంతులు తమ టాలెంట్ ని ప్రదర్శిస్తున్నారు. వారందరినీ దాటుకుంటూ వ్యూస్ తో ముందుకు రావడం అంటే ఎంతో ప్రతిభ ఉండి ఉండాలి. ఇక అమోల్ కాంబ్లీ డ్యాన్స్ కి ఫిదా అయిన నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. స్టెప్పులు ఇరగదీస్తున్నారు అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మీ ప్రదర్శన అద్భుతం అని కొందరు కితాబు ఇస్తున్నారు. స్వతహాగా టాలెంట్ ఉండటంతో పాటు వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకోవడానికి కూడా ఈ పోలీస్ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉండి ఉండచ్చు.. ఏదీ ఏమైనా ఇప్పుడు అమోల్ కాంబ్లీ ఒక మంచి పోలీస్ తో పాటు.. సూపర్ డ్యాన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.