Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Did Not Find Reason Why I Was Dropped India Test Star Nobody Contacted Me

Hanuma Vihari: నన్నెందుకు జట్టు నుంచి తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు

Published Date :July 12, 2023 , 3:11 pm
By NTV WebDesk
Hanuma Vihari: నన్నెందుకు జట్టు నుంచి తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా నుంచి నన్నెందుకు తప్పించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని క్రికెటర్ హనుమ విహారి అన్నారు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంత నిరాశ చెందానో.. జట్టు నుంచి ఎందుకు తొలగించారు అనే కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నానని అతడు చెప్పాడు. ఈ విషయం గురించి మేనేజ్‌మెంట్‌ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు అతని పేర్కొన్నారు.

Read Also: Gujarat: ఆదర్శ భార్య.. 10 ఏళ్లలో 7 సార్లు భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పించింది..

Also Read

  • Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
  • Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్‌గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
  • Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!

ప్రతి ఒక్కరి కెరీర్‌లో లోటుపాట్లు సహజం.. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని హనుమ విహారి అన్నారు. మొదట్లో చాలా బాధపడేవాడిని.. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి.. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన పడటం లేదు.. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం అని ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు.

Read Also: Project K: ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ప్రాజెక్ట్ కె వాయిదా.. ?

అయితే, కాకినాడకు చెందిన హనుమ విహారి 2018లో టీమిండియా తరఫున జట్టులోకి అరంగేట్రం చేశాడు. లండన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హనుమ విహారి తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2022లో బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు తర్వాత హనుమ విహారికి మళ్లీ జాతీయ జట్టులో అవకాశం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ అతడికి ఛాన్స్ లు మాత్రం రావడం లేదు.

Read Also: BRO : సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్..

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో అవకాశం వస్తుందని ఎదురుచూసిన హనుమ విహారికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉంటే.. దులిప్‌ ట్రోఫీ-2023లో సౌత్‌ జోన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్‌ జోన్‌తో ఆరంభమైన ఫైనల్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన విహారి 839 పరుగులు చేశాడు.. అతని అత్యధిక స్కోరు 111 పరుగులుగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Duleep Trophy
  • hanuma vihari
  • India vs West Indies
  • Team India
  • Test series

తాజావార్తలు

  • Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

  • Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్‌గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!

  • Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions